Insert widgets here

Monday, January 1, 2024

Know about Euro standards

 Know about Euro standards

 యూరో ప్రమాణాల గురించి తెలియ చేయండి  

గ్రీన్ హౌస్ వాయువులవల్ల వచ్చే హానికరమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు 1997, డిసెంబర్లో క్యోటో శాన్సెన్స్ జరిపాడు. క్యోటోకాన్ఫరెన్స్ ఆరురకాల గ్రీన్ హౌస్ గుర్తించింది. సాధారణంగా ఈ గ్రీన్ హౌస్ గ్యాస్లు పెట్రోల్, సహజ వాయువులు, బొగ్గు మొదలైన వస్తువులు మొండించటం వలన వాతావరణంలో కలుస్తున్నాయి. అవి

* కార్బన్ డై  (CO₂)

 * మీథేన్  (CH4)

* నైట్రస్  ఆక్సైడ్ (NO₂)

* హైడ్రో ఫ్లోరో కార్బన్ (HFC)

* పెర్ ఫ్లోరో కార్బన్ (PFC)

* సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ (SF6)

క్యోటో ప్రొటోకాల్ అభివృద్ధిచెందిన దేశాలను గ్రీన్హౌస్ గ్యాస్లను వెలువదించే కర్మాగారాలను తగ్గించి ప్రస్తుతం ఉన్న గ్రీన్హౌస్ గ్యాస్ పరిమాణం తగ్గించేందుకు కృషి చేయాలని సూచించింది. అమెరికా 25 శాతం గ్రీన్హౌస్ గ్యాస్ల పరిమాణం పెరగటానికి కారణం. క్యోటో ప్రోటోకాల్ ప్రకారం అన్ని అభివృద్ధిచెందిన, లేదా అభివృద్ధి చెందుతున్న దేశాలు గ్రీన్ హౌస్ల పరిమాణం తగ్గించటానికి అంగీకరించాయి. యూరోపియన్ కమిషన్ మరియు యూరోపియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ కొన్ని అర్హతా ప్రమాణాలు నిర్దేశించింది. వీటినే యూరో ప్రమాణాలు అంటారు. వీట  ప్రకారం ప్రయాణికుల కార్లనుంచి ఎక్కువగా వెలువడే కార్బన్ డై ఆక్సైడ్ శాతాన్ని వచ్చే పది సంవత్సరాల్లో ప్రస్తుతం ఉన్న స్థానంనుంచి 25 శాతం తగ్గించాలని నిర్ణయించుకుంది. 


మొదటిసారి 1992లో యూరో-1 ప్రమాణాలను అమలుచేశారు. వీటి ప్రకారం ప్రయాణికుల కార్లకు కాటలిటిక్ 

కన్వర్టర్లు బిగించటం మరియు ఆధునిక పరిజ్ఞానం ద్వారా CO/g శాతం తగ్గించటం. యూరో-2 ప్రమాణాలను 1998 నుంచి అమలులోకి తీసుకువచ్చారు. యూరో -3 ప్రమాణాలు 1 జనవరి, 2000 నుంచి అమలులోకి వచ్చాయి.

యూరో-4 ప్రమాణాలు 1 జనవరి, 2005 నుంచి అమలులోకి వస్తాయి.

 భారత ప్రభుత్వం 1 ఏప్రిల్, 2005 నుంచి యూరో-2 ప్రమాణాలు అన్ని కొత్త కార్లలోనూ ఉండాలని నిర్దేశించింది.

కొత్తగా గ్రీన్హౌస్ గ్యాస్లలో చేరిన మరొక వాయువు ట్రైఫ్లోరో మిథైల్ సల్ఫర్ పెంటాఫ్లోరైడ్.

Insert widgets here

Insert widgets here