Carbon emission trading
Carbon emission trading
కార్బన్ ట్రేడింగ్ వివిధ దేశాల మధ్య, కంపెనీల మధ్య పరస్పరం జరుగుతుంది. ఒకస్థాయి అభివృద్ధి చెందిన 39 దేశాలకు మొదటి ఐదేళ్ళకు (2008-12) గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారంపై పరిమితులను నిర్ణయించారు. దీని ప్రకారం సంబంధిత దేశాలలోని కంపెనీలు ఆ పరిమితికి లోబడే కాలుష్యవాయువుల్ని విడుదల చేయాలి. ఇక్కడే మార్కెటింగ్ అవకాశాలు ఏర్పడుతున్నాయి. తక్కువ స్థాయిలో కాలుష్యాన్ని సృష్టిస్తున్న కంపెనీలు/దేశాలు తమకున్న కోటాలోని మిగిలిన భాగం తాలూకు హక్కుల్ని, ఎక్కువ కాలుష్యం సృష్టిస్తున్న కంపెనీలు/ దేశాలకు విక్రయించుకోవచ్చు. క్యోటో ప్రోటోకాల్ ఈ తరహా వాణిజ్యానికి వీలు కల్పిస్తోంది. ఒక దేశంలో కంపెనీలు వాటికి నిర్దేశించిన పరిమితిని అతిక్రమించకుండా చూడటం, పర్యవేక్షించడం ఆయా ప్రభుత్వాలపై ఉంటుంది. కంపెనీలు/దేశాలు తమకు నిర్దేశించిన కాలుష్యపరిమితి కంటే తక్కువ కాలుష్యం సృష్టించే ప్రమాణాల్ని సాధించిన పక్షంలో వాటికి 'క్రెడిట్స్' ఇస్తారు. వాటికి ఈ క్రెడిట్స్ని అమ్ముకొనే హక్కుంటుంది. ఇదే విధంగా వివిధ దేశాల మధ్య ఈ కార్బన్ ట్రేడింగ్కు అలవెన్సులనబడే మరొక పద్ధతి కూడా ఉంది. ఆన్లైన్ ట్రేడింగ్ మరో ప్రత్యేకత. 'సిఓ2ఇ.కామ్' పోర్టల్ ఎమిషన్ల ఆన్లైన్
ట్రేడింగ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటయ్యింది.
ఈ కార్బన్ ట్రేడింగ్లో అనేక రకాలయిన విధానాలు, వేర్వేరు ధరలు ఉన్నాయి. క్రెడిట్ ఆధారిత ఎమిషన్స్ రిడక్షన్ ట్రేడింగ్, క్యాప్ అండ్ ట్రేడ్ ప్రోగ్రామ్, బేస్లైన్ ఎమిషన్ రిడక్షన్ ట్రేడింగ్ సిస్టమ్ (ప్రాజెక్టులు, కంపెనీల భారీ పరిశ్రమలకు వర్తించేవి), రేట్బేస్డ్
ఎమిషన్స్ తదితర ట్రేడింగ్ విధానాలకు రూపకల్పన చేశారు. షేర్ మార్కెట్లో ఉన్న ఫార్వర్డ్ సెటిల్మెంట్ ట్రేడ్, ఆప్షన్స్, డెరివేటివ్స్ మొదలగునవి ట్రేడింగ్ సంప్రదాయాలన్నింటినీ ఈ ఎమిషన్స్ ట్రేడింగ్లో పొందుపరిచారు.
మొక్కలు నాటడం, చెట్లు పెంచడంవంటి అలవాటు భారత్లో అధికంగా ఉంది.
సామాజిక అడవులు, అటవీ పెంపకంను ప్రోత్సహించడంతో పాటు, వనసంరక్షణ సమితులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం పచ్చదనాన్ని పెంచడానికి, అటవీభూములను విస్తరించడానికి కృషి చేస్తున్నది. ఫలితంగా భవిష్యత్తులో జరగబోయే 'కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్'లో మన దేశానికి వలు ప్రయోజనాలు ప్రాప్తించనున్నాయి. మనదేశంలో సమర్థంగా వ్యవహరించ కలిగే కంపెనీలకు ఈ ట్రేడింగ్ ఒక ఆదాయ వనరుగా మారనుంది. 2012 నాటికి అంతర్జాతీయ మార్కెట్లో ఈ కార్బన్ ట్రేడింగ్ వలన 150 బిలియన్ డాలర్ల మేరకు భారత్ ప్రయోజనం పొందగలదని భావిస్తున్నారు.
గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాన్ని డాలరుకు ఇంత చొప్పున లెక్కగడితే తృతీయ ప్రపంచ దేశాలలోనే కార్బన్ కాలుష్యం అధికంగా ఉందని స్పష్టమవుతుంది. ఇది వాస్తవ విరుద్ధం. కాబట్టి వర్ధమాన దేశాల్లో ప్రజలు నిజమైన కొనుగోలుశక్తి (పర్చేజింగ్ పవర్ ప్యారిటీ-పీపీపీ)ని ప్రామాణికంగా తీసుకొని లెక్కించాలని ప్రధాని వాజ్పేయి సూచించడం గమనార్హం. అభివృద్ధి చెందిన దేశాలలో ఇప్పట్కి కచ్చితమైన కాలుష్య నిబంధనలున్నప్పటికీ పెట్రోలియం ఉత్పత్తులను అధికంగా వినియోగిస్తున్న కారణంగా అక్కడ కార్బన్ కాలుష్యం తగ్గని పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఇంకా తగ్గించుకోవాలంటే, కాలుష్య నియంత్రణ ఏర్పాట్లపై కోట్లాది డాలర్లు వెచ్చించాల్సి ఉంటుంది. అదే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కాలుష్య నియంత్రణకు ఇంత వ్యయం చేయాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా చూసినప్పుడు కూడా భారత్ వంటి దేశాలకు ఈ ట్రేడింగ్ లో మంచి అవకాశాలు ఏర్పడుతాయి.
-
- వర్యావరణ వేత్తల ఆందోళన: కార్బన్ కాలుష్య వాయువులు వెలువడడాన్ని తగ్గించేందుకు మనస్ఫూర్తిగా ప్రయత్నం చేయకుండా - దానిని వర్తక వస్తువుగా మార్చడాన్ని ధనిక దేశాల కుట్రగా పర్యావరణ - శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు వారు వెలువరిస్తున్న కార్బన్ విషవాయువుల కాలుష్యాన్ని తగ్గించుకోవడంపై దృష్టిసారించాలి గానీ, తమ కాలుష్యాన్ని కొనసాగిస్తూ ఇతరదేశాలలో కాలుష్యం పెరగకూడదనే రీతిలో • వ్యవహరించడం ఉచితం కాదని వారు హెచ్చరిస్తున్నారు. అయితే > ఇవేమీ పట్టించుకోకుండా కార్బన్ ట్రేడింగ్కు సన్నాహాలు జరిగి పోయాయి.
Insert widgets here